Posts

Showing posts from September, 2025

కనుగొంటిని నిన్నే ఓ నజరేయ

కనుగొంటిని నిన్నే ఓ నజరేయ సమర్థుడవని సహాయము చేయా (2) నీ ప్రభావము నాలోకి చెరగా  (2) నా స్వరూపము మారిపొయేగా  (2) ప్రయత్నలు చేసి వెసారియుంటిని ఉన్న ఆస్థి అంత చేజార్చుకుంటిని    (2) వైద్యుల చుట్టు కాళ్ళు అరిగెటట్టు    (2) ఎంత తిరిగిన సరికాకయుంటిని      (2) స్వంత జనులతోనే వెలివేయబడితిని అపనిందలపలై మతి పొయి చెడితిని    (2) బ్రతుకెందుకని మనసే చంపుకొంటిని      (2) జీవచ్శవమై ఇలా మిగిలియుంటిని        (2) నీ మహిమను గూర్చు వార్తలను వింటిని స్వస్థపరచు దేవా నినునమ్ముకుంటిని   (2) దైర్యం లేక ఎదురుగ రాలేక           (2) వెనుక నుండి వచ్చి నినుముట్టుకుంటిని(2)

కృపలో జీవించాలని

కృపలో జీవించాలని ఆ కృపలోనే మరణించాలని ఆశ ఉన్న ప్రాణాన్ని  తృప్తి పరచుమో దేవా తృప్తి పరచుమో దేవా నిందించు వారు నా వారై  ఓదార్చు వారు కనుమరు!గై పోయిరి కృప అన్నది నాతో- ఓదార్పు నేనని కృప అన్నది నాతో- ఆధరణ నేనని ఏమిలేని నాకు అన్ని నీవైనావు నీతో నేనుండుటకు నన్నెన్ను కొన్నావు కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి కృపలో మరణించె ఆ కృప నిమ్మయ్యా