YESAAYA NEE KRUPA NAAKU CHALAYYA,యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

యేసయ్యా నీ కృప
నాకు చాలయ్యా
కష్టమైనను నష్టమైనను
వెదనైనను శోధనైనను
చాలయా నీ కృప నాకు చాలయ్యా

ఒక్క నిమిషమైన నను వీడకున్నది
వెన్ను తట్టి చేయి పట్టి నడుపుచున్నది
నేను మరచిన మరువకున్నది
నేను విడచిన నను వీడకున్నది

ఎన్నెన్నో మేలులు చేసినావయా
సమస్తమును నా కొరకు
దాచినావయా
అడుగకనే అక్కరలు తీర్చినావయా
నా హృదయ వాంఛను
తృఫ్తి పరచినావయ్యా

తండ్రీ నీ సన్నిధిలో నిలిపినావయా
వింతైన ప్రేమను చూపినావయా
విలువైన ప్రాణమును ఇచ్చినావయా
రక్షణ ఆనందముతో నింపినావయ్యా

     రచన , స్వరకల్పన
     శ్యాంసన్ & స్టాలిన్
      9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న