YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అదిపతి
యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అధిపతి

1. పచ్చిక బయళ్ళ లో
    పరుండ జేశాడు
    శాంతి జలములకు           
    నడిపించు చున్నాడు
    నా ప్రాణమునకు
    సేద దీర్చాడు
    తన నీతి మార్గములో
    నడిపించు చున్నాడు
    నిత్య జీవమును
    నాకు ఇచ్చాడు

2. గాఢాంధ కారములో
    వెలుగై యున్నాడు
    శత్రువుల యెదుట
    విందును నాకిచ్చెను
   నూనెతో నా తలనంటియున్నాడు
   బ్రతుకు దినములో
   క్షేమము  నా కిచ్చెను
   అపాయమేదైనను
   నా యొద్దకు రానేరాదు

      రచన , స్వరకల్పన
      శ్యాంసన్ & స్టాలిన్
       9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song