గడచిన కాలం
గడచిన కాలం నీదు కృపలో
నడిపించితివి నా యేసయ
ఎన్నెన్నో ఎన్నెన్నో మేలులు చేశావు
ఇంకెన్నో ఇంకెన్నో దాచియుంచావు
వ్యాధి బాధలు నను ఆవరించగా
బలహీనతతో నే కృంగియుండగా
బాధలన్ని బాపి స్వస్థతనిచ్చావు
బలముతో నింపి నను నడిపించావు
లోకంలో నేను దూషించబడగా
శోకంలో వున్న నన్ను విడిపించావు
ఆదరించి నన్ను ధైర్యపరిచినావు
తోడుగ వుండి నడిపించినావు
రచన & స్వర కల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment