ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
దవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ఎవరు ఆయన కిలలో
సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గుర్తింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి
స్ఫుర ద్రుపి అగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
సిరులు కురిపించెను
పరలోక తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు కలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు(2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసగె
వరమేరి తనయుండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు(2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
Comments
Post a Comment