ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్ధరొక్కటగుటేమిటో

ఇదిదేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం

ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్ళినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో

గతకాలకీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు
పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో

ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు
పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న