కాలమునేరిగి నిదుర మేలుకో

కాలమునేరిగి నిదుర మేలుకో
భారము కలిగి బ్రతుకు దిద్దుకో-2
దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో
దేహము ఉండగానే దేవుని మనసు    తెలుసుకో...
ఇదే కదా అనుకూల సమయం సోదరా
మరో దినం నీకు ఉందో లేదో ఎరగరా....
 కాలం ఎరిగి నిదుర మేలుకో
భారం కలిగి బ్రతుకు దిద్దుకో...

1) నేడు నీతోఉందిలే రేపునీది కాదులే
 ఉన్న సమయం మందే నిన్ను నీవు తెలుసుకో...
లోకం ఎంతో ఉందిలే నిన్ను పిలుస్తుందిలే
 ఎండమావి నిజమా ఎరిగి నీవు
మసులుకో....ఆ.... ఆ.... ఆ 2
 కంటికింపుగా కనిపించే రంగుల వలయం కదా
సొంత గూటినే మరిపించే దేవునికి దూరం చేస్తుందా...

2) శరీరాశ పుట్టగా లొంగి పోకు సులువుగా
పాపమంటే పామే.. కాటు వేస్తుందిగా
దేహమందు మంచిగా ఉన్నదేదీ లేదుగా
 అవయవాల దాహం తీర్చు సాధ్యపడదుగా
ఆ.... ఆ.... ఆ.... 2
 శరీరాన్ని పాపం ఎేలితే నరకంలో ఆత్మకు బాధ
  నితి సాధనాలుగా
దేవునికి కప్పగిస్తే నేకదా మరియాద....

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song