అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే

అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే 
బాధను పంచుకునే బంధువు నీవే
ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
సహయం చెయగలిగిన నా హితుడవు నీవే
నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య


1 కన్నీరు తడిచి కలతలను బాపే
కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే
కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే
కొనియాడ  నా యేసయ్య కోటి కంటాలతో
కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో
ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య


2.వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
వారసునిగా మార్చి వీరునిగా చేసావే
వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే
విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే  
ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య 

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song