ఒక్కసారి నన్ను క్షమియించవా దిక్కులేని స్థితిలో నే పడియుంటిని
ఒక్కసారి నన్ను క్షమియించవా
దిక్కులేని స్థితిలో నే పడియుంటిని"2"
అయ్యో నాపాపం అడ్డువచ్చెనే " 2 "
సమాధానమే లేక కృంగిపోతిని " 2 "
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా " 2 "
చెడు స్నేహమే నన్ను చెరిపినది
సుడిగుండమై నన్ను చుట్టినది " 2 "
చివరి ఘడియలో నేను నిన్ను పిలువగా "2"
అలలాగా వచ్చి నీ దరికి చేర్చవా " 2 '
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా " 2 "
అన్యులే నన్ను వెలివేయగా
బంధుమిత్రులే నన్ను బాధించగా "2"
సమాధిలోనికే నేను దిగిపోతినే " 2 "
సమాధానమే లేక చచ్చియుంటిని "2"
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా " 2 "
ఆకలితో నేను అలమటించగా
దాహముతో నేను తపియించగా "2"
జీవాహరముతో నను నింపవా " 2 "
నీ జీవజలములతో తృప్తిపరచవా"2"
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా " 2 "
Comments
Post a Comment