కరములు చాపి స్వరములు ఎత్తి

కరములు చాపి – స్వరములు ఎత్తి  హృదయము తెరచి – సర్వం మరచి   
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్ – మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్ 

శిరమును వంచి ధ్వజములు ఎత్తి – కలతను విడచి కృపలను తలచి 

మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్- మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్

 1.పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను –    మరువగలనా మహానీయుడా   

కల్వరిగిరిపై కురిసిన ఆ ప్రేమను -విడువగలనా నా యేసయ్యా      ..2.. 

నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా – నా ధ్యానానికే మూలం నీవయ్యా  ..2..                                                                              || కరములు ||

2.    చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును- మరువగలనా మహానీయుడా 

సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని- విడువగలనా నా యేసయ్యా     ..2.. 

నా జీవానికే జీవం నీవయ్యా – – నా గానానికి రాగం నీవయ్యా      ..2..                                                                              || కరములు ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS