కనులున్నా కానలేనిచెవులున్నా వినలేని

కనులున్నా కానలేని
చెవులున్నా వినలేని-(2)
మనసున్నా మతి లేని
స్థితియున్నా గతిలేని-(2)
వాడను యేసయ్య...
ఓడిపోయిన వాడను.-(2)
         ||కనులున్నా కానలేని||

అన్నీ ఉన్నా ఏమి లేని
అందరూ ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని
చెంతనున్న చేరలేని
యేసయ్య... నన్ను విడువకయ్యా-(2)
దిక్కులేని వాడని
వాడను యేసయ్యా...
చెదరిపోయిన గూడును            
కనులున్నా కానలేని

భాషలున్నా భావము లేని
ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తి లేని
ప్రార్థన ఉన్న ప్రేమ లేని
యేసయ్య... నన్ను కరునించుమా-(2)
ఫలము లేని వాడను
వాసిని యేసయ్య...
పేరుకు మాత్రమే విశ్వాసిని
కనులున్నా కానలేని

బోధ ఉన్నా బ్రతుకు లేని
పిలుపున్నా  ప్రయాస పడని
సేవ ఉన్నా సాక్ష్యము లేని
 సంఘమున్నా ఆత్మలు లేని
యేసయ్య...నన్ను నింపుమయ్య-(2)
ఆత్మ లేని వాడను
పాదిరిని యేసయ్య
మాదిరి లేని కాపరిని               
కనులున్నా కానలేని

Comments