కనురెప్ప పాటైన కను మూయలేదు

కనురెప్ప పాటైన కను మూయలేదు  
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు  
ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
తన రూపులో నన్ను మార్చుకున్నది (2)
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ లోగిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song