క్రీస్తునే వేదకు క్రీస్తులోనే బ్రతుకు

క్రీస్తునే వేదకు క్రీస్తులోనే బ్రతుకు
క్రీస్తులో ఎదుగు క్రీస్తేసే వెలుగు "2"
                       
గాఢాందకారాన పయనించినా
శోధన బాధలు వెన్నంటినా........ 
వెలిగించుకో నిన్ను వేతలందునా
బలమైన ప్రభుయేసు పథమందునా
పరదైసులో నీకు పాలుండునూ "2"
మరి ఏల? ఈ జాగు ఓ సోదరా!
                    
ఇహలోక మోహాలు బంధించినా
ఈ లోక వాంఛలు వంచించినా  
పరలోక ఆ ప్రేమ సామ్రాజ్యము
అనిపించు ప్రభుయేసు కడనుండినా
కరుణించి కాపాడి దరిచేర్చునూ "2"
మరి ఏల? ఈ బాగు ఓ సోదరీ!
                        
ఏ కారు చీకటుల సంధించినా
ఏ దాహ బాధలు నీ కుండవు
నీ పాప భారాన్ని తను మోసెను
తన రాజ్యభాగ్యాన్ని అందించెను
నీ చింతలన్ని తను తీర్చెను   "2"
మరి ఏల? ఈ బాగు ఓ నేస్తమా!
                        
      

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న