కన్నీరే మనిషిని బాధిస్తుంది

కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది (2)        ||కన్నీరే||

కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది (2)
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా (2)  ||కన్నీరే||

కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా (2)        ||కన్నీరే||


Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS