ఎందుకో నన్నింతగా నీవుప్రేమించితివో దేవా

ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య

నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే 
నా స్థానములో నీవే

నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలిక లోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో

నా మనవులు ముందె
నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song