కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా ||2|| సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి

 ||కుమ్మరి||

 విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా

 ||కుమ్మరి||

 లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS