ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

ఓరన్న…  ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న||

చరిత్రలోనికి వచ్చాడన్నా  వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా 
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)   

పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా 
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)        

సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2) 




Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song