కోటి కాంతుల వెలుగులతో
కోటి కాంతుల వెలుగులతో
ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం
చిగురించెను ఈ తరుణం.....
దివిని విడిచి భువిని మనకై
మానవునిగా జన్మించెను.....
దిగులు చెందక గతము మరచి
యేసుని ఆరాధింతుము.......
లోకానికే ఇది పర్వదినం.......
మహదానందమే ప్రతి క్షణం... "2"
" కోటి కాంతుల "
రాజులకు రాజుల రాజు..............
ప్రభువులకు ప్రభువే తానుగా......
మనుజులకు మాదిరి తానై..........
ఉండుటకే ఇల యేతించేగా......... "2"
మనకోసమే జన్మించెను..............
తన ప్రేమనే పంచెను...................
ఆ పరమునే తను విడిచెను.........
నర రూపిగా వెలసెను..................
సృష్టికే మూలాధారమైన...............
దేవుడే ఇల దిగి వచ్చేనా...............
శోధన బాధలు ఎన్ని ఉన్నా...........
నేటితో ఇక దరి చేరునా................
ఆనందమే ఇక సంతోషమే.............
ప్రతివానికి శుభపరిణామమే.......... "2"
" కోటి కాంతుల "
మహిమగల మహిమోన్నతుడు...
పశువులశాలలో పసివానిగా.......
కరుణ గల కారణజన్ముడ...........
శిశువుగా మనలో ఒకవానిగా..... "2"
ఏనాటికి మన తోడుగా..............
ఉండాలని ఆండగా....................
ప్రతివానికి స్నేహితునిగా.............
హృదయాన జన్మించేగా..............
అంధకారపు ఈ లోకమునందు...
దేవదేవుడు ఉదయించేగా...........
ఎన్నడూ లేని వేల కాంతులు........
లోకమందు పవళించెగా..............
సంతోషమే సమాధానమే............
ఇది దేవాది దేవుని బహుమానమే "2"
" కోటి కాంతుల "
Comments
Post a Comment