కదిలిందీ కరుణరధం

కదిలిందీ.. .కరుణరధం ..
సాగిందీ.. క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
కరిగీ వెలిగే కాంతిపధం

కదిలింది.. కరుణరధం ..
సాగింది.. క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగె కాంతిపధం

మనుషులు చేసిన పాపం..
మమతల భుజాన ఒరిగిందీ..
పరిశుద్ధాత్మతో పండిన గర్భం..వరపుత్రునికై వగచింది.. వగచిందీ.....
దీనజనాళికై దైవకుమారుడు.. 
పంచిన రొట్టెలే.. 
రాళ్ళైనాయి.....
పాప క్షమాపణ 
పొందిన హృదయాలు
నిలివున కరిగీ.. 
నీరయ్యాయి.. 
నీరయ్యాయి 
*అమ్మలారా! నా కోసం.. ఏడ్వకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడ్వండి*

ద్వేషం.. అసూయ..కార్పణ్యం.. 
ముళ్ళ కిరీటమయ్యింది 
ప్రేమా..సేవా..త్యాగం.. చెలిమి నెత్తురై ఒలికింది.. ఒలికిందీ.....
తాకినంతనే స్వస్తత నొసగిన తనువుపై కొరడా ఛెళ్ళందీ.......
అమానుషాన్ని అడ్డుకోలేని 
అబలల ప్రాణం అల్లాడింది
అల్లాడి ఉందీ.......
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి  దారుణం హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు 
చెల్లాచెదరై కుమిలాయి

పరమ వైద్యునిగ 
పారాడిన పవిత్ర పాదాలూ
నెత్తురు ముద్దగ మారాయి
అభిషిక్తుని రక్తాభిషేకంతో 
ధరణి ద్రవించి ముద్దాడింది

శిలువను తాకిన కల్వరిరాళ్ళూ కలవరపడి..
కలవరపడి..
కలవరపడి..
అరిచాయీ.... అరిచాయీ....

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న