ఎటువైపు నీ పయనమో నేస్తమాహోరుగాలిలో చిరుదీపమా

ఎటువైపు నీ పయనమో నేస్తమా
హోరుగాలిలో చిరుదీపమా    "2"
ఇటువైపు మరణం అటువైపు జీవం "2"
నీ గమ్యం ఏమిటో గమనించుకొనుమా "2"
                             
శత్రువగు సాతాను మిత్రునివలే చేరి
నీ జీవితాన్ని కూల్చియున్నదా   "2"
నిజ సేహితుడైన యేసయ్య చేరుమా
నీ కొరకై తన ప్రాణం అర్పించెనే  "2"
                           
కారుచీకటిలో కానరాని మార్గమున
తిరుగాడుచుంటివని పరికించుకొనవా "2"
నేనే మార్గం సత్యం జీవమని......
ఆశ్చర్యమైన వెలుగు యేసే అని తెలుసుకో "2"
                             
ఎండమావి లాంటి లోకములో నీవు
ఆశలన్ని ఆవిరై అలమటించువేళ  "2"
నిత్యజీవ ఊటయైన యేసయ్య చేరితే....
జీవజల ఊటలు ప్రవహింపజేయుడా  "2"
                           

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song