ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో

ఎవరికి ఎవరు ఈ లోకంలో 
చివరికి యేసే పరలోకంలో  

ఎవరెవరో ఎదురవుతుంటారు 
ప్రాణానికి నా ప్రాణం అంటారు  
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణ గల యేసు నితో ఉంటాడు

మనుషుల సాయం వ్యర్థము రా 
రాజులుని నమ్మిన వ్యర్థము రా
యెహోవాను ఆశ్రయించుట 
ఎంత మేలు ఎంతో మేలు

ధనము నీకుంటే అందరూ  వస్తారు 
దరిద్రుడు వైతే దరికి ఎవరు రారు
ఎవరిని నమ్మినా ఫలితము లేదురా 
యేసుని నమ్మిన మోక్షం ఉందిరా  

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న