ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా

ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు మాకున్నదంతా నీ పాదచెంత - 
అర్పించి సేవించినా నీ ఋణం తీరునా|| 2|| 
 ||ఏమివ్వగలమయ్యా||

1.మీమింకను బలహీనులమైయుండగా మా కొరకై నీవు భువికొచ్చినావు 
మా అత్రికమములకై గాయపరచబడుటకై నిన్ను నీవే అప్పగించుకొంటివా 
మితిలేని ప్రేమ యోగ్యతలేని మాపై చూపించినావా - నీకేమివ్వగలము ||2|| 
 ||మాకున్నదంతా||

2.మేమింకను పాపులమైయుండగా పరిశుద్ధలను చేయ ఏతెంచినావు 
మా పాపములకై బాధింపబడుటకై 
నిన్ను నీవే అర్పించుకొంటివా 
శాశ్వత ప్రేమ అర్హతలేని మాపై చూపించినావు -నీకేమివ్వగలము||2|| ||మాకున్నదంతా||

3.మేమింకను విరోధులమైయుండగా సమాధానపరచుటకు దిగివచ్చినావు మా దోషములకై నలుగగొట్టబడుటకై నిన్ను నీవే సమర్పించుకొంటివా విస్తారమైన ప్రేమ ఎన్నికలేని మాపై చూపించినావు - నీకేమివ్వగలము ||2||
 ||మాకున్నదంతా||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS