కాచెను నను నీ కృప దాచేను నను నీలో

కాచెను నను నీ కృప దాచేను నను నీలో
కొదువలేదు కొరత లేదు
నీకృపయే నాకు చాలును
యేసయ్యా నా యేసయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా

యోగ్యాతే లేని నన్ను
యోగ్యుని చేసింది నీ కృప
అర్హత లేని నన్ను అర్హుని చేసింది నీ కృప
హస్తముచాపి ననుబలపరచి
స్థిరపరచినది నీకృప

పాపపు ఊబిలో నుండి పైకి లేపింది నీ కృప
కలువరి రక్తముతో నన్ను
శుద్ధుని చేసింది నీ కృప
హస్తముచాపి నను బలపరచి రక్షణనిచ్చినది నీకృప

ఆదారనే నాకు లేనపుడు
ఆదారించినది నీకృప
అప్తులే నా చేయ్యీ విడువగా
విడువలేదే నీకృప
హస్తము చాపి భుజమును తట్టి బలపరచినది నీ కృప

          రచన స్వర కల్పన గానం
           శ్యాంసన్ & స్టాలిన్
             9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song