కొనియాడబడును

కొనియాడబడును
యెహోవాయందు 
భయభక్తులు గల వనిత
తనవారికైనా పగవారికైనా 
పంచును సమత మమత

ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు
ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు
కలిగిన భార్య ఇంటికే దీపము
సంఘమనే ఆ వధువునకు 
నిజమైన రూపము

తండ్రివలె ఓదార్చి తల్లివలె 'సేదదీర్చి
మిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ
ద్తేవజ్ఞానముతో 
కుటుంబమును నడుపును
రాబోవు వాటి గూర్చి 
నిశ్చింతగా నుండును

బ్రతుకు దినములన్నియును 
భర్తకు మేలే చేయును
దీనులకు దరిద్రులకు 
తన చేయిచాపును
ఆహారమును తానే సిద్దపరచును
ఇంటి వారినందరిని 
కని పెట్టుచుండును

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song