ఆలయంలో ప్రవేశించండి అందరూ

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
నీ బ్రతుకులో పాపమా.. కలతలా... 
నీ హృదయంలో
బాధలా కన్నీరా - నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం

1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదకేవారికంతా
కనబడు దీపమై
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుటవలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరును రారండి
ఆనందం ఆనందం - హల్లేలూయ
                                 ॥ఆలయం॥

2. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవవృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం - మంచిమాటలే
హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందం ఆనందం - హల్లేలూయ
                                 ॥ఆలయం॥

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న