ఇద్దరో క్కటిగ మారేటీ మధురమైన క్షణము

ఇద్దరో క్కటిగ మారేటీ మధురమైన క్షణము
దేవుని చిత్తము లో పెనవేసిన 
నిత్య అనుబంధము/2/
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆసందడి/2/

ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి/2/
అవ్వను చేసి జతపరచి
ఫలించమని దీవించును
సృష్టి పైన అధికారముతో
పాలించుమని నియమించెను/2/
                       
ఏక మనసుతో ముందుకు సాగే
జీవ వృక్షముకు మార్గము ఎరిగి/2/
సొంత తెలివిని మానుకుని 
దేవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆపయనం 
దేవుని కొరకై ప్రతి క్షణం/2/

భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరునుకుంటూ/2/
క్రీస్తు ప్రేమను పంచాలి 
సాక్షములను చాటించాలి 
సంతానమును పొందు కొని తండ్రి
రాజ్యమునకు చేర్చాలి/2/
                        

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న