కల్వరి నాధా కరుణించవా

కల్వరి నాధా కరుణించవా 
కరుణించి నన్ను కాపాడవా
పరమ దయాళి యేసయ్యా 
పాప విమోచక యేసయ్యా
పరమ పవిత్రుడ యేసయ్యా
పరమవైద్యుడా యేసయ్యా
శుభములనొసగు శ్రీకరయేసా
నీకే ప్రస్తుతి శ్రీ క్రీస్తా

దావీదు తనయ దయచూపవా 
దయతోడ మమ్ము దరిచేర్చవా
దయసాగరా యేసయ్యా 
దీనబందు యేసయ్యా

పాపుల రక్షక ప్రభుయేసయ్యా 
పవిత్రంగా నన్ను పరిహరించవా
పరమ దయాళి యేసయ్యా 
పాప విమోచక యేసయ్యా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న