ఒంటరినై నేనుండగా వేయిమందిగా నను మార్చినావు
ఒంటరినై నేనుండగా -
వేయిమందిగా నను మార్చినావు ||2|| ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా
||2||
నను వాడుకో నా యేసయ్యా -
నీ సేవలో నను వాడుకో
నను వాడుకో నా యేసయ్యా -
నీ పరిచర్యలో నను వాడుకో ||2||
షిత్తిములో ప్రజలు వ్యభిచారము చేయగా - నీ కోపము రగులుకొని
తెగులును పంపితివి ||2||
నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు ||2||
నీపై ఆశక్తి చూపిన ఫినెహాసులా ||2||
||నను వాడుకో||
ఆనాటి ప్రజలందరితో
తన సాక్ష్యము చెప్పుచు -
ఎవనియొద్ద సొమ్మును
నేను ఆశింపలేదని ||2||
ప్రార్ధన మానుటవలన
పాపమని ఎంచుచు ||2||
శ్రేష్టమైన సేవ చేసిన సమూయేలులా||2||
||నను వాడుకో||
నా జనులు చేయుచున్న
పాపములు చూడగా
నా కనులు కన్నీటితో క్షిణించుచున్నవి ||2|| కన్నీటితో ప్రజల యొక్క విడుదలకై ||2|| ప్రార్ధనతో పోరాడిన యిర్మీయాలా ||2||
||నను వాడుకో||
Comments
Post a Comment