ఏది ఎమైన గాని నీతోనే ఉంటానయ్యా

ఏది  ఎమైన గాని నీతోనే ఉంటానయ్యా నన్నుఎవరేమన్నా గాని నిను విడిచిపోలేనయ్యా
నా ప్రాణమా నా సర్వమా నాకున్నది నీవేనయ్యా

నీవు లేని భవనములు వద్ధయ్యా 
నీతో యున్నా గుడారమే చాలయ్యా
నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్య 
నీవు లేనిదే నాకూ ఏది వలదయ్యా
నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా

లోకాశలు నన్ను పిలిచినా 
లోకపు శ్రమలు అడ్డుగా నిలిచినా
నాగటిపై చెయ్యి వేసి వెను తిరిగి చూడలేనయ్యా
నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా

నీవు లేని ఘనతలు నాకు వద్ధయ్య 
నీ పాద సన్నిదే నాకు చాలయ్యా
నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్య
నా ఘనతంతయు నీవే కదా నీతోనే ఉంటానయ్యా

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song