ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా - ఓ ప్రభువా
           నీవే నా మంచి కాపరివి
           నీవే నా మంచి కాపరివి

 చll  దారితప్పిన నన్నును నీవు 
       వెదికి వచ్చి రక్షించితివి 
       నిత్య జీవమునిచ్చిన దేవా 
       నీవే నా మంచి కాపరివి.   ll ఓ ప్రభువా ll 

చll  నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని 
       ఎల్లప్పుడూ చేయి విడువక
       అంతమువరకు కాపాడు దేవా 
       నీవే నా మంచి కాపరివి     ll ఓ ప్రభువా ll 

చll  ప్రధాన కాపరిగా నీవు నాకై 
       ప్రత్యక్షమగు ఆ గడియలో 
       నీవు నన్ను మరువని దేవా
       నీవే నా మంచి కాపరివి   ll ఓ ప్రభువా ll

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న