కృంగిపోకు నేస్తమా

కృంగిపోకు నేస్తమా 
మంచిరోజు నీకుంది సుమా
మారదీ తలరాతని మనసు రానీకుమా
మంచిరోజులోస్తాయమ్మా
మరువనీడు నీదేవుడమ్మా
ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా
తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా  
                                               ॥కృంగిపోకు॥
            1॰
శూన్యమైన సృష్ఠినే చూడకుండెనా
ఆకారం లేనిదనీ ఆదమరిచెనా
చీకటి కమ్మెననీ చూడకుండెనా
వెలుగు కలుగుగాక అనీ పలుకకుండెనా
మరిచెనా లేక మంచిదిగా మలిచెనా ॥2॥
మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
అందుకే                                   ॥కృంగిపోకు॥
             2॰
యేసేపు అన్నలే తోసేసినా
బాషరాని దేశానికి అమ్మేసినా
బానిసైన బాధ్యతగా పనిచేసినా
బాధితునిగా చేసి బంధించినా
మరిచెనా లేక మంత్రినే చేసెనా ॥2॥
మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
అందుకే                                   ॥కృంగిపోకు॥

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song