ఏమివ్వగలను నీ దివ్యప్రేమకు
ఏమివ్వగలను నీ దివ్యప్రేమకు
ఏమివ్వగలనయ్యా నీ శిలువ ప్రేమకు
నా ప్రాణమునే నీకిచ్చినా నీ ఋణం తీరేనా
" ఏమివ్వగలను "
నా పాపము కొరకు శిలువలో వేలాడి
నా దోషము కొరకు రక్తమును కార్చితివి "2"
నా హృదయమునే నీకిచ్చినా
నీ ఋణం తీరేనా............... "2"
" ఏమివ్వగలను "
నా చెడుతనమును తుడిచేసితివి
నా దీన స్థితిని సరిచేసితివి.... "2"
నా జీవితం నీకిచ్చినా నీ ఋణం తీరేనా "2"
" ఏమివ్వగలను "
నా తల్లివలే నన్ను ప్రేమించితివి
నా తండ్రివలే నన్ను కాపాడితివి "2"
నా సర్వమునే నీకిచ్చినానీ ఋణం తీరేనా
" ఏమివ్వగలను "
Comments
Post a Comment