క్షణమైనా గడువదు తండ్రీ నీ కృప లేకుండా
క్షణమైనా గడువదు తండ్రీ నీ కృప లేకుండా నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు
ప్రభువా నీదయ లేకుండా
నీ దయ లేకుండా ||2||
నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం
నీవే నా సర్వం యేసు ....||2|| ||క్షణమైనా||
ఇంత కాలం లోకంలో బ్రతికా జీవితం అంతా వ్యర్దం చేసా తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్దం అనీ అనుభవించాను
నీ సన్నిధిలో అనందమని ||2|| ||నీవే||
పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమై వున్నా నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్య నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా ||2|| ||నీవే||
జ్ఞానమున్నా పదవులెన్నున్నా దనము ఉన్నా సర్వం నాకున్నా నీవు నాతో లేకుంటే అంత శున్యమేగా పరలోక స్వాస్థ్యము ఎల్లపుడూ శ్రేష్టమెగా ||2|| ||నీవే|| ||క్షణమైనా||
Comments
Post a Comment