అందరు నన్ను విడిచినా....అందరు నన్ను విడిచినా....

అందరు నన్ను విడిచినా....
అందరు నన్ను విడిచినా....
నీవు నన్ను విడువ నంటివే
నా తల్లియునీవే నాతండ్రియు నీవే 
నా తల్లితండ్రి నీవే యేసయ్యా......."నాతల్లి"

వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా........"వ్యాధు"
నాకొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా...."నా కొండ"

లోకము నన్ను విడచినా
నీవునన్ను విడువనంటివే"
నా బంధువూ నీవే నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా

నేను నిన్ను నమ్ముకొంటినీ
నీవు నన్ను భయపడ కంటివే.....
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా..."నా తోడు"

Comments