ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా
ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా
ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను
నీతోడు నీడా లేకుండా ॥2॥
నీ ప్రేమా వర్ణించలేనిది 
నీ ప్రేమా వివరించలేనిది
నీ ప్రేమా మరచిపోలేనిది
నీ ప్రేమా విడిచి పోలేనిది             ॥ఎలా॥
            
శాశ్వత ప్రేమతొ ప్రేమించావు  }
కునుకక కాపాడి రక్షించావు    }॥2॥
విడువక ఎడబాయక తోడున్నావు }
సర్వకాలము నాతో ఉన్నావు         }॥2॥
                                            ॥నీ ప్రేమా॥
            
శ్రమలలొ నన్ను వీడిపోలేదు     }
దుఃఖములో నన్ను ఓదార్చావు }॥2॥
మేలులతో నన్ను తృప్తిపరిచావు   }
నిత్యం నన్ను నడిపించావు           }॥2॥
                                            ॥నీ ప్రేమా॥
            
పాపిని నన్ను ప్రేమించావు      }
నాకొరకూ నీ ప్రాణమిచ్చావు  }॥2॥
రక్తం చిందించీ విమోచించావు   }
నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు  }॥2॥
॥నీ ప్రేమా॥                                 ॥ఎలా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న