ఓ సొదరా ఓ సొదరి యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు

ఓ సొదరా ఓ సొదరి 
యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు 
నిదురమాను మగత వీడు 
కన్ను విప్పి కలియజూడు

యెరుషలేము గుమ్మములు కాలిపోతున్నవి
ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
ప్రార్ధనాయుధముతో పునరుత్థాన శక్తితో
పునఃనిర్మాణము చేతము రండి

నిరాశ నిష్పహలే ఎదురు నిలిచినా
నిందలెన్నో మబ్బులుగ మనల క్రమ్మినా
నిలిచెదం యేసుతో నడిచెదం దీక్షతో నీరీక్షణ బలముతో సాగిపోదము

అపవాది బాణములు ఎన్ని విసిరిన 
అగ్ని గంధకముల వాన చుట్టు ముసిరిన అదరము బెదరము 
అరికి మనము వెరవము 
అన్న యేసు సన్నిధిలో లేదిక భయము

సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా చావు నోడించినది ఈ దేహమే కదా
సిలువ తేజస్సుతో కరుణమూర్తి మనసుతో సిరులు విరియు జీవితాలు నిర్మిద్దాము

యేసే ఈ సంఘమునకు అసలు పునాది
యేసే ఈ జగత్తుకు ఆశజ్వోతి 
యేసే ఆరంభము ఆయనే అంతము
యేసే మన జీవితాల నవవసంతము

సాక్ష్యమిచ్చె సంఘమే జీవించే సంఘము
జీవించే సంఘమే సాక్ష్యమిచ్చు సంఘము
సాక్ష్యము విశ్వాసము
సౌఖ్యము సహవాసము
సిలువ చలువ పందిరిలో వర్ధిల్లాలి

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న