ఐక్య పరచుమయ్యా ఈ వధూవరులను

ఐక్య పరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను
మధుర ప్రేమలో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ 
నీ దీవెనలే పంపుమా

ఆనందము తోడ దుఃఖమునే గెల్వ చిరునవ్వు తోడ కష్టముల నోర్వ
సంసారనావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమా

ప్రార్ధన జీవితము సమాదానము భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా

ఇహలోక బోగముపై మనసుంచక 
పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై 
సాగే కృప దయచేయుమా

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song