కొండ కోన లోయలోతుల్లో

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం 
                           || కొండ కోన ||

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     
                            ||కొండ కోన ||

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     
                             ||కొండ కోన ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS