ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2)         ||ఏమివ్వగలనయ్య||

1. గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుతున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణింపలేను నా యేసయ్యా (2)         ||నిన్ను గూర్చి||

2. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2)         ||నిన్ను గూర్చి||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS