కలువరి గిరి యాత్రలో

కలువరి గిరి యాత్రలో
మనుషులున్న ఎడారిలో " 2 "
నా యేసుని వేదన
ఈ జగతికి తల వంచెనా " 2 "

నేరమేమి చేయలేదు దోషమేది కానరాదు
ముళ్ళతో కిరిటమొత్తి తన్నుతూ గుద్దుతూ
గేలి చేయుచు ఉమ్మిరా
నోరు తెరువనే లేదు ప్రేమ 
బలి పశువునిగా మారె ప్రేమ
                             "  కలువరి "

మూగ బోయెను వీధులన్నీ
దాహమైన తీర్చలేదే
చెళ్లుమని కొరడాలతోని కొట్టిరా
తిట్టిరా బరబరా మని ఈడ్చిరా
నెత్తుటి ముద్దాయే చూడు
మహిమ రూపుని దేహము
                             "  కలువరి "

కాళ్లకు చేతులు సీలలు కొట్టి వ్రేలాడదీసేను
ప్రక్కలో ఒక పోటు పొడిచి
చచ్చేనా? బ్రతికేనా? వెతికి వెతికి చంపిరా
ఏమని వివరించ గలను
ఆ సిలువలో త్యాగము
ఏమని వర్ణించ గలను నా యేసుని ప్రేమను
                               "  కలువరి "

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song