ఈ స్తుతి నీకే మా యేసు దేవామనసారా నిన్నే సేవింతుము

ఈ స్తుతి నీకే మా యేసు దేవా
మనసారా నిన్నే సేవింతుము – (2)
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా (2)      
                                          ||ఈ స్తుతి||

జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని (2)
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని (2)
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని    
                                       ||ఈ స్తుతి||

మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా (2)
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా (2)
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని         ||ఈ స్తుతి

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న