కొంతసేపు కనబడి

కొంతసేపు కనబడి 
అంతలోనే మాయమయ్యే
ఆవిరివంటిదిరా ఈ జీవితం
లోకానకాదేదీ శాశ్వతం

ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కలో
వచ్చేదెవరు నీతో మరణము వరకు
ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు

చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా

నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి
విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song