మహిమా ఘణతకు
మహిమా ఘణతకు అర్హుడ నీవే
ఘనత ప్రభావము కలుగును నీకే యేసయ్యా నీ సన్నిధిలో
పరవశించి నే పాడానా
యేసయ్యా నీ సన్నిధిలో
ప్రహర్షించి నే పాడనా
మహిమ మహిమ యేసుకే మహిమ ఘనత ఘనత యేసుకే ఘనత
ఆకాశములు నీదు మహిమను అంతరిక్షము నీ నామమును
సమస్తము ఏకమై ప్రకటించగా
సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని
నదులు కొండలు ధ్వని చేయగా పొలములోని చెట్లు చప్పట్లు కొట్టగా సమస్తము ఏకమై స్తుతియించగా సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని
ప్రకృతి అంతా పరవశంబుతో
నీ నామమును ప్రణుతించుచుండగా సమస్తము ఏకమై ప్రస్తుతించగా సర్వోన్నత స్థలములలో
స్తుతి ఘనత ప్రభావమని
రచన స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment