మధురమైన నీ ప్రేమా
మధురమైన నీ ప్రేమా
మరపురాని కరుణా
కురిపించితివి నీ కృప నాపై
మరిపించితివి ఈ లోక ప్రేమ
పలువురు నన్నుచూచి పరిహసించినా పదివేల మంది నాపై పడివచ్చినా పదిలముగానే ఉండేదనయా
పరిశుద్ధుడా యేసు నీ సన్నిధిలో
నాకున్నవారే నిందించినా
నాకయినవారే నన్ను విడిచినా విడువలేదు నన్ను మరువలేదు నీవు మరపురానిదే నీ దివ్య ప్రేమ
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైన నాకు ఎంతో మేలు
చనిపోవు చుంటిని దిన దినము నాలో జీవించుచుంటిని సిలువ ప్రేమ నీడలో
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment