నా ప్రాణమా నా యేసుని
నా ప్రాణమా నా యేసుని
మరువక స్తుతియించుమా
ఆయన చేసిన ఉపకారములను
ఆయన చేసిన మేలులన్నియు
మరువక స్తుతియించుమా
మనసున ధ్యానించుమా
మరణము నుండి నీ ప్రాణమును విమోచించినాడు
కరుణ కటాక్షమును కిరీటముగా
నీపై యుంచినాడు
మేలులతోను నీ హృదయమును
తృప్తి పరచుచున్నాడు
నీ పాపమునకు ప్రతికారము
నీకు చేయలేదు
నీ దోషమునకు ప్రతిఫలమును
నీకు ఇయ్యలేదు
ఉన్నతమైన ఆయన కృపను
అధికముగా ఉంచినాడు
రచన , స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment