కీర్తనీయుడా
కీర్తనీయుడా నిను కీర్తింతును అద్వితీయుడా ఆరాధింతును కరుణామయుడా కరములు జోడించి ప్రేమామయుడా నాశిరమును వంచి
నిన్నే స్తుతియించెదను నా యేసయ్యా నిన్నే ఘణపరచేదను
కానాను యాత్రలో తోడైయున్నావు కనికరము చూపి నడిపించావు
ఆకలైన వేళ ఆహరమునిచ్చి
దప్పికైన వేళ వారి దాహము తీర్చావు
నా బ్రతుకు బాటలో నాతో వున్నావు
నా బారమంతటిని భరియించావు అడగకనే అక్కరలు తీర్చుచున్నావు అడుగులు తడబడక
నను నడుపుచున్నావు
నా జీవిత నావకు చుక్కానివయ్యావు చక్కగ నడిపించి దరి చేర్చావు పెనుతుఫాను గాలులు నాపై లేచినా అణచివేసి నాకు నెమ్మది నిచ్చావు
రచన స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment