ఏరి కోరి ఎన్నుకుంటిని
ఏరి కోరి ఎన్నుకుంటిని
కోరికోరి హత్తుకుంటిని
నా యేసు ఉత్తముడని
రుచి చూసి యెరిగితిని
రక్తమిచ్చి నన్ను కొన్నాడు
ప్రాణమిచ్చి రక్షించాడు
సొత్తుగ నన్ను చేసుకున్నాడు
తన పాత్రగ నన్ను మలచుకున్నాడు
దారి తప్పిన నన్ను చూచాడు
వెదకి వచ్చి ఎత్తుకున్నాడు
బుజముల మీద నన్ను మోసాడు
తన మందలో నన్ను చేర్చుకున్నాడు
గాయ పడిన నన్ను చూశాడు
గాయములను తానె కట్టాడు
పొందిన దెబ్బలచే విడుదలిచ్చాడు
మంచి సమరయిడై ప్రేమ చూపాడు
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment