ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం  త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం 
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)
                                       ||ఇంతలోనే|| 

 బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు* (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||

 మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో* (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS