ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా-2
అర్హత లేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్య ర్థమై-2
పదేపదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా-2
కలవరాల కోటలో కన్నీటి బాటలో -2
కాపాడే కవచముగా నన్ను ఆవరించిన
దివ్య క్షేత్రమ స్తోత్ర గీతమ ||ఆనందం||
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థుము నీదని-2
నీ సన్నిధి వీడక సంధించి పడనా-2
నీ కొరకై ధ్వజమెత్తి నిన్ను ప్రకటించన
సత్యవాక్య మై జీవ వాక్యమై
||ఆనందం||
సర్వ సత్యమై నా మార్గమై
సంఘ క్షేమమే నా ప్రాణమై-2
లోక మహిమ చూడక నీ జాడలు వీడక-2
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశయం
||ఆనందం||
Comments
Post a Comment