ఊహించలేనయ్య వివరించలేనయ్యా

ఊహించలేనయ్య వివరించలేనయ్యా 
ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను ||ఊహించ||

1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను
         ||ఊహించ||

2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము
         ||ఊహించ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS